మరొకసారి తెలంగాణ బంద్ – అక్టోబర్ 19 న…

Thursday, October 10th, 2019, 02:00:09 AM IST

గత కొన్ని రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలోని ర్టీసీ కార్మికులు అందరు కూడా సమ్మె చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సమ్మెని మరింత ఉద్రుతంగా చేయడానీకి ఆర్టీసీ కార్మికులు నిర్ణయించుకున్నారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో వినిపించినటువంటి మాట రాష్ట్ర బంద్… కాగా మరొకసారి ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర బంద్ కార్యక్రమాన్ని తలపెట్టనున్న. ఇక నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మెను మరింత తీవ్రం చేయడానికి ఉద్యమించనున్నారు మన ఆర్టీసీ కార్మికులు. కాగా ఈమేరకు తెలంగాణ రాష్ట్రము లోని అన్ని డిపోల వద్ద వారి ఆందోళనని తీవ్రతరం చేయడానికి పూనుకుంటున్నారు కార్మికులు.

ఈమేరకు అక్టోబర్ 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఈమేరకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయం కూడా తీసుకుంది. అయితే తెలంగాణలోని ప్రతిపక్షాలతో గురువారం (అక్టోబర్ 10) జేఏసీ మరొకసారి తమ సమావేశాన్ని జరపనుంది. అయితే ఆ చర్చలను బట్టి ఆర్టీసీ కార్మికులు తలపెట్టనున్న బంద్ పై తమ చివరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. అంతేకాకుండా ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్స్ ని నెరవేర్చాలని కోరుకుంటున్నారు.