కేసీఆర్ ఓడిపోయినట్టే.. బీజేపీ ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ కీలక వ్యాఖ్యలు..!

Friday, June 11th, 2021, 06:45:24 PM IST


మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరడం దాదాపు ఖాయమయ్యింది. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారు. అయితే నేడు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ ఈటల నివాసానికి వెళ్లారు. వీరి భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తరుణ్‌చుగ్ కేసీఆర్ సర్కార్‌పై మండిపడ్దారు. 20 ఏళ్లుగా తెలంగాణ కోసం ఈటల రాజేందర్ కొట్లాడుతున్నారని, కేసీఆర్ ఆయన కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్లుందని అన్నారు.

అంతేకాదు తెలంగాణలో ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య యుద్ధం నడుస్తుందని, ఈటల బీజేపీలోకి రావడం అంటేనే కేసీఆర్ ఓడిపోవడమని అన్నారు. ఒక్క వ్యక్తి, అతని కుటుంబం చేస్తున్న అరాచకాల మీద ఈటల గొంతు వినిపించారని అందుకే ఆయనను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేశారని అన్నారు. ఈటల పోరాటానికి బీజేపీ మద్దతు పలుకుతుందని తరుణ్‌చుగ్ అన్నారు. కేసీఆర్ అహంకారం, రాజరికం తెలంగాణ నుండి పోవాలని తెలంగాణ వికాసం కోసం ఉద్యమకారులను కలుపుకుని పనిచేస్తామని చుగ్ అన్నారు.