తెలంగాణ బడ్జెట్ సంబంధిత వివరాలు…

Tuesday, September 10th, 2019, 02:04:26 AM IST

తెలంగాణ రెండవసారి అధికారాన్ని సొంత చేసుకున్న తెరాస పార్టీ అధినేత కెసిఆర్ పాలన పరంగా ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందుకుపోతున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్. కాగా సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రానికి సంబందించిన పూర్తిస్థాయి బడ్జెట్ ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టారు. ఇకపోతే తానూ ప్రజలకోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నానని, తాను తీసుకునే నిర్ణయాలకు ఎవరైనా అడ్డు తగిలితే సహించేది లేదని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోడానికి కూడా సిద్ధమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. ఇకపోతే తెలంగాణ తాజా బడ్జెట్ సంబంధిత వివరాలు…

తెలంగాణ బడ్జెట్ సంబంధిత వివరాలు…

2019-20 సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం రూ. 1,46,492 కోట్లు.
రెవెన్యూ వ్యయం రూ.1,11, 055 కోట్లు
మూలధన వ్యయం రూ. 17,274 కోట్లు
మిగులు బడ్జెట్‌ అంచనా రూ.2,044 కోట్లు
ఆర్థిక లోటు రూ.24,081 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.9,402 కోట్లు
గ్రామపంచాయతీలకు రూ.2,714 కోట్లు
మునిసిపాలిటీలకు రూ. 1,764 కోట్లు
విద్యుత్ సబ్సిడీలకు రూ.8 వేల కోట్లు
రైతు రుణాల మాఫీకి రూ.6 వేల కోట్లు
రైతుబంధుకు రూ.12 వేల కోట్లు
రైతు బీమా కోసం రూ.1125 కోట్లు
ఆరోగ్యశ్రీకి రూ.1,336 కోట్లు
వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల పింఛన్ రూ. 1000 నుంచి రూ. 2016కు పెంపు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు రూ. 31,802 కోట్లు
త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ల మంజూరు.
కల్యాణలక్ష్మి, పెన్షన్ స్కీములన్నీ కొనసాగుతాయి.