తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారు…

Friday, June 14th, 2019, 08:31:58 PM IST

తెలంగాణాలో మంత్రివర్గ సమావేశం జరుపుకోడానికి దాదాపుగా ముహూర్తం ఖరారు అయింది. కాగా ఈనెల 18న తెలగాణ మంత్రివర్గ సమావేశం జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించుకున్నారు. కాగా ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోనున్నారని సమాచారం. ఇటీవల తెలంగాణాలో జరిగినటువంటి ఎన్నికల హడావుడి కారణంగా, ఈ సమావేశాలు ఆలస్యమయ్యాయని, అందుకని రాష్ట్రానికి సంబందించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం అయిందని తెరాస ప్రభుత్వం చెబుతుంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖను రద్దు చేసి, రెవెన్యూ మరియు పంచాయితీ రాజ్ శాఖలను కలపాలని తెరాస ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం. అంతేకాకుండా తెలంగాణాలో గల పలు చట్టాలకు సంబందించిన మార్పులకోసమని మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని పలు వార్తలు వినిపిస్తున్నాయి…

ఇకపోతే ఈ మంత్రివర్గ సమావేశం జరిగిన మరునాడే తెరాస కార్యవర్గ సమావేశం కూడా జరగనుందని సమాచారం. ఈ నెల 19న తెరాస భవన్ లో ఈ కార్యవర్గ సమావేశం జరపాలని తెరాస పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాగా పార్టీ అద్యక్షుడు కెసిఆర్ నేతృత్వాన జరిగే ఈ సమావేశంలో కెసిఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారో, భవిష్యత్ కార్యాచరణ కోసమని కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో అని పార్టీ నేతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే, మిగిలిన మంత్రి పదవులు కూడా ఆరోజే మరికొందరికి అప్పగిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి… కాకపొతే ఈ విషయాలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.