ఏపీ సీఎంని ఫాలో అవుతున్న తెలంగాణ సీఎం…

Thursday, July 11th, 2019, 03:00:29 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేస్తూ, ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరికీ కూడా అండగా నిలవడానికి తన ప్రభుత్వం తరపున అధికారులందరిని ఆదేశించారు. అయితే ఆపిల్ గత ఐదేళ్ళలో 1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 391 మందికి మాత్రమే నష్ట పరిహారం ఇచ్చినట్టు గత ప్రభుత్వ రికార్డులు సూచిస్తున్నాయి. అయితే ఏపీలో కొత్తగా అధికారంలోకివచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రైతుల ఆత్మహత్యలపై స్పందిస్తూ… ‘ రైతు ఆత్మహ్యతలకు సబంధించి కలెక్టర్లు తమ జిల్లాల్లోని డేటాను పరిశీలించాలి. అర్హులైన రైతు కుటుంబాలకు వెంటనే పరిహారం అందజేయాలి. కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాల దగ్గరికి వెళ్లాలి. వారి కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపాలి. ఎక్కడైన సరే రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే కలెక్టర్లు స్పందించాలి. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. 7లక్షలు పరిహారం ఇవ్వడమే కాకుండా.. ఆ మొత్తాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా చట్టాన్ని కూడా తీసుకొస్తాం. ” అన్నారు.

అయితే ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతో చరిత్రాత్మకమైందని, రైతులకోసం ఎవరు కూడా ఇంతలా ఆలోచించలేదని, కానీ జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్‌ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉండాలని పలువురు తెలంగాణ రైతులు కోరుతున్నారు. అయితే ఈ సందర్భంగా తమ ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడిన కెసిఆర్ తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుకుటుంబాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అంతేకాకుండా ” ఓట్లే పరమావధిగా కాకుండా అభివృద్ధి, సంక్షేమం పట్ల దృష్టిసారించామన్నారు. గ్రామాల్లో మూడు నెలల్లో మంచి మార్పు చూడబోతున్నామని…” కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.