బిగ్ న్యూస్ : కరోనా విషయంలో కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.!

Thursday, August 6th, 2020, 11:50:14 AM IST

గత కొన్నాళ్ల కితం వరకు తెలంగాణలో కరోనా పరిస్థితులు పై తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యం చెందడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు కేసీఆర్ పై వచ్చి పడ్డాయి. టెస్టులు సహా హాస్పిటల్స్ లో కరోనా సోకిన వారికి సరైన ట్రీట్మెంట్ కూడా లేదని పెద్ద ఎత్తునే వ్యతిరేకత మొదలు కావడంతో సర్కార్ టెస్టుల విషయంలో మరింత స్పీడ్ పెంచింది. ఇదిలా ఉండగా ఇప్పుడు కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం తెలంగాణలో రోజుకు దాదాపు 20 వేలు లేదా ఆ పైకి టెస్టులు నిర్వహిస్తుండగా ఇప్పుడు రోజుకు ఎలా లేదన్నా 40 వేలు టెస్టులు చేసి తీరాలని ఆదేశాలు జారీ చేసారట. అందుకు గాను 100 కోట్ల నిధులను కూడా ఈ బుధవారం విడుదల చేసినట్టు సమాచారం. దీనితో కరోనాకు సంబంధించిన వైద్య సామగ్రి అంతా సమకూర్చాలని కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈసారి నుంచి తెలంగాణలో కరోనా సంఖ్య ఎలా ఉంటుందో చూడాలి.