తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్..!

Monday, April 19th, 2021, 08:40:26 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకింది. స్వల్ఫంగా కరోనా లక్షణాలు కనిపించండంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ రావడం నిజమేనని డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.

అయితే సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, 9 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని, అవసరమైతే ఫాం హౌస్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తామని డాక్టర్ ఎం.వి.రావు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు మరియు పలువురు టీఆర్ఎస్ నేతలకు కూడా కరోనా సోకింది.