తెలంగాణలో రేపే సహకార ఎన్నికలు.. సర్వం సిద్దం..!

Saturday, February 15th, 2020, 01:14:23 AM IST

తెలంగాణలో రేపు జరగనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం రాష్ట్రంలోని 747 పీఏసీఎస్‌ల పరిధిలోని 6,248 మంది డైరెక్టర్‌ పోస్టులకు శనివారం ఎన్నికలు నిర్వహించేందుకు సహకారశాఖ ఎన్నికల అథారిటీ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే ఈ ఎన్నికల నిర్వహణకు 747 మంది గెజిటెడ్‌ అధికారులను ఎన్నికల అధికారులుగా, మరో 20 వేలకుపైగా సిబ్బందిని నియమించారు.

ఈ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్‌ పత్రాలను ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు సరఫరాచేశారు. సుమారు 12 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరుగనున్నది. మధ్యాహ్నం రెండు నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతారు, సాయంత్రం లోపు ఫలితాలు విడుదలవుతాయి.