పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టనున్న తెలంగాణ కాంగ్రెస్!

Wednesday, June 9th, 2021, 07:35:15 AM IST

తెలంగాణ రాష్ట్రం లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రో ధరల పెంపు ను నిరసిస్తూ ఈ నెల 11 వ తేదీన రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంక్ ల ముందు ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత ఐదు నెలల్లో 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇందుకు నిరసనగా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమం ను విజయవంతం చేయాలి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో పెరగడం తో సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు అంటూ ప్రతి పక్ష పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.