తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా పాజిటివ్.. కుమారుడికి కూడా..!

Tuesday, June 30th, 2020, 12:52:15 AM IST


తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి పొలిటికల్ లీడర్లను కూడా కరోనా వెంటాడుతూ ఉంది. అయితే ఇప్పటికే కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మరో టీఆర్ఎస్ ముఖ్యనేతకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కి మరియు ఆయన కుమారుడికి కూడా పాజిటివ్ వచ్చింది అని వచ్చింది. దీంతో మిగతా కుటుంబసభ్యులకు నెగెటివ్ రావడంతో వారందరిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.