బ్రేకింగ్ : తెలంగాణ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం…?

Friday, February 7th, 2020, 09:09:20 PM IST

తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు అందరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఘోరమైన షాక్ ఇచ్చింది. ఈ నెల 8వ తేదీ రెండో శ‌నివారాన్ని కూడా ప‌నిదినంగా ప‌రిగ‌నించాల‌ని తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీచేసిన‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అయితే దానికి కారణం లేకపోలేదు… జ‌న‌వ‌రి 1వ తేదీని సెల‌వు దినంగా పరిగణించిన కారణంగా ఫిబ్రవరి 8 ని పని దినంగా పరిగణించారని సమాచారం. ఇకపోతే రేపు అనగా 8 న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ తో పాటు అన్ని జోన‌ల్‌, స‌ర్కిల్ కార్యాల‌యాలు య‌దావిధిగా ప‌నిచేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. అంటే రేపు కూడా ఎదావిదిగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, పాఠశాలలు కూడా పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.