బిగ్ రిపోర్ట్: దేశంలో కరోనా సామూహిక వ్యాప్తిలో తెలంగాణ టాప్..!

Monday, June 22nd, 2020, 08:06:32 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో రాష్ట్రాన్ని మరో షాకింగ్ రిపోర్ట్ తీవ్ర కలవరానికి గురిచేస్తుంది. దేశంలో కరోనా సామాజిక వ్యాప్తికి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ అవకాశాలున్నాయని ఇండియన్ పిక్సల్స్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చింది.

అయితే ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తెలంగాణలో సామూహిక వ్యాప్తి కలిగే అవకాశం 122 శాతం ఉందని చెబుతుంది. అయితే ప్రస్తుతం దేశంలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కూడా సామాజిక వ్యాప్తికి 65 శాతం అవకాశమే ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే మరో తెలుగు రాష్ట్రం ఏపీలో సామాజిక వ్యాప్తి కేవలం 8 శాతమే ఉంది. ఏదేమైనా కరోనా సామాజిక వ్యాప్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్న వార్త రాష్ట్ర ప్రజలను తీవ్ర విస్మయానికి గురుచేస్తుంది.