రెస్క్యూ ఆపరేషన్: చిరుతను రక్షించిన పోలీసులు…ఒకరికి గాయం!

Thursday, May 28th, 2020, 12:46:33 PM IST


నల్గొండ జిల్లాలో మారిగుడ మండలం వద్ద ఒక చిరుత పులిని అటవీ శాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసి రక్షించారు. అయితే ఈ ఆపరేషన్ లో ఒక అటవీ శాఖ అధికారి పై చిరుత దాడి చేయడం జరిగింది. ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి చాలా చిన్న చిన్న గాయాలతో నే ప్రాణాలతో బయట పడ్డారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ ను పోలీస్ అధికారులు ఒక వీడియో రూపంలో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అయితే చిరుత ను వల వేసి పట్టుకున్నట్లు తెలుస్తోంది. దాని మొహం వరకు ఒక క్లాత్ తో మూసి వేసి బొన్ లోకి పంపించారు. అయితే పోలీసులు రెస్క్యూ చేసి చిరుత ను కాపాడటం వారి దైర్య సాహసాలను చూపడం పట్ల ప్రజలు వారి నీ ప్రసంసిస్తున్నారు.