లంబోదరుడికి తెలంగాణ కానుక

Monday, September 8th, 2014, 05:04:23 PM IST


ఖైరతాబాద్ కైలాస విశ్వరూప మహాగణపతిపై ఈ సాయంత్రం ఐదు గంటలకు పూలవర్షం కురవనున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెలికాఫ్టర్ నుంచి పూలవర్షం కురిపిస్తామని గణేష్ చవితి ఉత్సవాలను ప్రారంభించిన మొదటి రోజు కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీని నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పూలను సరఫరా చేస్తున్నట్టు తెలుస్తున్నది.

అత్యధికంగా ఈ సంవత్సరం 60 అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. వచ్చే ఏడాది నుంచి ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు ఒక్కో అడుగు చొప్పున తగ్గించుకుంటూ రావాలని ఉత్సవకమిటి నిర్ణయించడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భారీ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.