బ్రేకింగ్ : తెలంగాణాలో వచ్చిన కొత్త బులెటిన్..సరికొత్త కేసుల లెక్కలు ఇవే.!

Sunday, July 26th, 2020, 11:55:25 AM IST

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విషయంలో గత కొంత కాలం నుంచి విడుదల చేస్తున్న బులిటెన్ ల విషయంలో సరికొత్త మార్పులు చేర్పులు చేస్తున్నారు. కానీ ఏనాడూ ఆపలేదు. ప్రతీరోజు లెక్కలను ఏదొక సమయంలో అందించారు. కానీ నిన్న ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులిటెన్ విడుదల చేయకపోవడంతో కాస్త అనుమానాలు మొదలయ్యాయి. కానీ తర్వాత వారు దానికి వివరణ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఆ సరికొత్త బులిటెన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విడుదల చేసారు. ఇందులో కేవలం టెస్టులు వివరాలు మాత్రమే కాకుండా గాంధీ ఆసుపత్రిలో బెడ్స్ మరియు ఇతర వివరాలను కూడా అందుబాటులో ఉంచడం విశేషం. ఇక లెక్కల్లోకి వెళ్తే వీరు నిన్న ఉదయం 8 గంటల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా గత 24 గంటల్లో నమోదు కాబడిన వివరాలను పొందుపరిచారు.

గత 24 గంటల్లో మొత్తం 15 వేల 654 శాంపిల్స్ పరీక్షించగా అందులో 1593 కేసులు పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. అలాగే దీనితో తెలంగాణాలో మొత్తం కేసుల సంఖ్య 54 వేల 59 కు చేరుకోగా గత 24 గంటల్లో 8 మంది మరణించగా 998 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఈ నమోదు కాబడిన కేసులలో ఒక్క హెచ్ జిహెచ్ఎంసి పరిధిలో 641 కేసులు నమోదు అవ్వగా రంగారెడ్డిలో 171 కేసులు భారీగా నమోదు అయ్యాయి.