కేసీఆర్ షాక్ ఇవ్వనున్న గవర్నర్..ఒకే దెబ్బకి రెండు పిట్టలు

Wednesday, September 18th, 2019, 03:45:12 PM IST

తెలంగాణలో సీఎం కేసీఆర్ కి చెక్ పెట్టటానికే నరసింహన్ ని మార్చి కొత్త గవర్నర్ గా తమిళ సై తీసుకోని వచ్చారు. 2023 లో ఎలాగైనా తెరాసకి గట్టి ఇవ్వాలని, కేసీఆర్ మెడలు వంచాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పోటీదారుడిగా బీజేపీ ఎదగాలని ఆ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న తమిళి సై ని ప్రత్యేకంగా తెలంగాణకి తీసుకోని వచ్చారు.

ఇప్పుడు ఆమెతో కేసీఆర్ కి చెక్ పెట్టటానికి బీజేపీ పార్టీ సిద్దమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వస్తున్నా సమాచారం ప్రకారం గవర్నర్ రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో సీఎం ప్రగతి భవన్ ప్రజాదర్బార్ ఏర్పాటు చేశాడు. కానీ అక్కడ సమస్యలు వినే వాళ్లే కరువయ్యారనే మాటలు వినవచ్చాయి. ఏ తర్వాత వాటిని ఆపేశారు.

రాజ్ భవన్ లో కూడా గతంలో ప్రజాదర్బార్ జరిగాయి. కాకపోతే ఎదో పండగలకి మాత్రమే అది జరిగేది, కానీ ఇకపై వారం వారం రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించే ఉద్దేశ్యంతో గవర్నర్ ఉన్నట్లు తెలుస్తుంది. అదే కనుక జరిగితే ప్రభుత్వం పాలనా సరిగ్గా లేదు కాబట్టే గవర్నర్ స్వయంగా రంగంలోకి దిగిందని బీజేపీ పార్టీ ప్రచారం చేస్తారు. దాని వలన తెరాస పై నెగిటివ్ టాక్ వస్తుంది. అలాగే బీజేపీకి మంచి మైలేజ్ వస్తుంది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు ప్రభుత్వానికి వీలులేదు. గవర్నర్ యొక్క ఇష్ట ప్రకారమే అది జరుగుతుంది. మరి ఈ విషయంలో తెరాస ఎలా స్పందిస్తుందో చూడాలి.