కల్నల్ సంతోష్ భార్యకు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు..!

Tuesday, June 23rd, 2020, 02:43:02 AM IST


భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌ బాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు నివాళి అర్పించారు. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్ వారి కుటుంబ పరామర్శించారు.

అంతేకాదు వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియచేసి, రూ.5 కోట్ల చెక్కును, హైదరాబాద్‌లో నివాస స్థలం పత్రాలను సీఎం కేసీఆర్ స్వయంగా అందజేశారు. అంతేకాదు సంతోష్ భార్య సంతోషికి గ్రూప్ 1 నియామక పత్రాన్ని కూడా అందించారు. అయితే కమర్షియల్ టాక్స్ అధికారిగా సంతోషిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.