ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించిన తెలంగాణ సర్కార్..!

Wednesday, May 27th, 2020, 01:24:35 AM IST

కరోనా వైరస్ నేపధ్యంలో లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో తమ విధులకు హాజరుకాలేకపోతున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఊరట లభించింది. ఏపీ సచివాలయ ఉద్యోగులంతా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అయితే ముందుగా ఈ విషయంపై ఏపీ సీఎస్ నీలం సాహ్ని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌లో చిక్కుకుని తమ ఉద్యోగులు విధులకు రాలేకపోతున్నారని వారి కోసం ఏపీ ప్రభుత్వం వేసే బస్సులకు వచ్చేందుకు వారికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.