LRS దరఖాస్తు గడువు పొడిగించిన తెలంగాణ సర్కార్.. ఎప్పటివరకు అంటే?

Friday, October 16th, 2020, 03:00:09 AM IST


భూముల క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ గడువు నిన్నటితో ముగియడంతో ఆ గడువును తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ పొడిగించింది. అయితే నిన్నటి సాయంత్రంలోపు మొత్తం 16,28,844 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అందులో 6,67,693 దరఖాస్తులు గ్రామ పంచాయితీల నుంచి రాగా 6,70,085 దరఖాస్తులు మున్సిపాలిటీల నుంచి, 2,91,066 కార్పొరేషన్ల నుంచి వచ్చాయి.

అయితే ఈ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా మంది ఇంకా తమ బూములకు, స్థలాలకు ఎల్ఆర్ఎస్ కట్టుకోలేదన్న కారణంగానే ప్రభుత్వం ఈ గడువును పొడిగించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎల్ఆర్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయినప్పటికి ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.