బోనాలపై తెలంగాణ సర్కార్ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు ఇవే..!

Tuesday, June 23rd, 2020, 12:40:16 AM IST


తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతుండడంతో త్వరలో రాష్ట్రంల్లో జరగనున్న బోనాలపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండగలను ప్రజలు ఇళ్లలోనే ఉండి జరుపుకున్నారు. అయితే బోనాలను కూడా ఇళ్లల్లోనే జరుపుకోవాలని చెబుతూ, బోనాల వేడుకలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

అయితే ఈ నెల 25న గోల్కొండలో ఉత్సవాలు ప్రారంభమవుతుండగా ఆ వేడుకల్లో కేవలం 10 మంది మాత్రమే పాల్గొంటారని, అన్ని దేవాయాల్లోనే ప్రభుత్వమే పట్టువస్త్రాలు సమర్పిస్తుందని తెలిపింది. అంతేకాదు ఈ సారి పూజారులు మాత్రమే ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తారని, గటాల ఊరేగింపు నకు అనుమతి లేదని ఉత్సవాలను టీవీలు, సోషల్ మీడియాల్లో ప్రత్యక్ష ప్రసారం ఇస్తారని, ప్రజలంతా తమ మొక్కులను ఇళ్లల్లోనే చెల్లించుకోవాలని సూచించారు.