గ్రేటర్ హైదరాబాద్‌లో రోడెక్కనున్న బస్సులు.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే..!

Saturday, May 23rd, 2020, 03:00:21 AM IST

కరోనా కారణంగా లాక్‌డౌన్ నేపధ్యంలో తెలంగాణలో దాదాపు రెండు నెలలుగా తిరగని ఆర్టీసీ బస్సులు మొన్న లాక్‌డౌన్ సడలింపులలో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు రోడెక్కాయి. అయితే అన్ని జిల్లాలలో బస్సులు నడుస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌లో కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇంకా ప్రభుత్వం బస్సులకు పర్మీషన్ ఇవ్వలేదు.

అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన హైదరాబాద్‌లోని వివిధ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు సర్కార్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వ ఉద్యోగుల కోసం శనివారం నుంచి హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపిస్తేనే బస్సులోకి అనుమతి ఉంటుందని మొత్తం నగరంలో 32 రూట్లలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు తిరుగుతాయని ప్రకటించింది.