తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు – కరోనా పరీక్షలకు నిరాకరణ…

Thursday, May 21st, 2020, 09:13:41 AM IST

తెలంగాణ రాష్ట్రంలో మహమ్మారికరోనా తీవ్రత భయంకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో మహమ్మారి కరోన నిర్దారిత పరీక్షలు జరపడానికి 12 ప్రైవేట్ ల్యాబ్‌లకు ఐసీఎంఆర్ అధికారికంగా అనుమతి ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి నిరాకరిస్తూ, ఆరోగ్య శాఖా అందించిన ఉత్తర్వులను రద్దు చేసింది. కాగా ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇదివరకే అనుమతించిన ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా నిర్దారిత పరీక్షలు జరపడానికి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సరైన చికిత్స అందించడానికి అనుమతులను జారీ చేసింది. అంతేకాకుండా ప్రభుతసుపత్రుల్లో చికిత్సకై ఎలాంటి ఒత్తిడి తేకూడదని ఆదేశాలు విడుదల చేసింది.

అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆర్థిక స్తోమతను భరించే వీలు ఉన్నవారు అందరు కూడా ప్రైవేట్ సేవలను వినియోగించుకోవచ్చని, అందులో కూడా ఐసీఎంఆర్‌ ఆమోదించిన ఫీజులే వసూలు చేయాలని ఆయా ఆస్పత్రులు, ల్యాబ్‌లను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం నిన్న ఆదేశాలిచ్చింది. కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స అందించడం కోసం ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల యాజమాన్యాలు ఐసీఎంఆర్‌ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

తెలంగాణలోని ప్రైవేట్ ల్యాబ్‌లు :

1. అపోలో హాస్పిటల్, జూబ్లీహిల్స్
2. విజయ డయాగ్నస్టిక్స్, హిమాయత్ నగర్
3. విమత ల్యాబ్స్, ఐడీఏ చర్లపల్లి
4. అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్,బోయిన్‌పల్లి5. డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, పంజాగుట్ట
6. పాత్‌కేర్ ల్యాబ్స్, మేడ్చల్
7. అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సర్వీసెస్, శేరిలింగంపల్లి
8. మెడ్సిస్ పాథ్‌ల్యాబ్స్, న్యూ బోయిన్‌పల్లి
9. యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
10. బయోగ్నసిస్ టెక్నాలజీస్, మేడ్చల్ మల్కాజిగిరి
11. స్టార్ హాస్పిటల్, బంజారాహిల్స్
12. టెనెట్ డయాగ్నస్టిక్స్, బంజారాహిల్స్