నిత్యవసర ధరల పెంపుపై తెలంగాణ హైకోర్ట్ సీరియస్..!

Thursday, March 26th, 2020, 12:30:02 AM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపధ్యంలో రాష్ట్రమంత లాక్‌డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయాన్ని అదునుగా చేసుకుని కొందరు దళారులు నిత్యవసర సరుకుల ధరలను విపరీతంగా పెంచేశారు.

అయితే ధరలు పెంచొద్దని స్వయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా వ్యాపారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ధరలు పెరగడంతో సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. కాగా నిత్యావసర ధరల పెరుగుదలపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన హైకోర్ట్ దీనిపై సోమవారం విచారణ జరపనుంది.