ఢిల్లీలో జర్నలిస్టుల ధర్నా

Saturday, September 6th, 2014, 11:07:19 AM IST


తెలంగాణలో ప్రసారాలు నిలిపివేసిన చానళ్లను వెంటనే పునరుద్దరించాలని కోరుతూ ఢిల్లీలోని కెసిఆర్ నివాసం వద్ద జర్నలిస్ట్ సంఘాలు ధర్నా చేపట్టాయి. మీడియా స్వేచ్చకు సంకెళ్ళు వద్దంటూ జర్నలిస్టులు నినాదాలు చేశారు. తెలంగాణప్రాంతానికి చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. టీవీ9, ఎబీఎన్ ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలని వారు డిమాండ్ చేశారు.

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నివాసం వద్ద పోలీసులు బారీ సంఖ్యలో మొహరించి బారీకేడ్లను ఏర్పాటు చేసి జర్నలిస్టులు లోపలి చొచ్చుకురాకుండా అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని వారు స్పష్టం చేశారు.