మందులపై ఇకపై తెలుగు పేర్లు కూడా.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

Tuesday, July 14th, 2020, 08:00:25 AM IST

సాధారణంగా ఏ జబ్బుకైనా ఇచ్చే మందులపై ఆంగ్లంలోనే పేర్లు ఉంటుంటాయి. అయితే ఆంగ్లంలో పేర్లు ఉండడంతో ఏ రోగానికి ఏ మందు వేసుకోవాలని అర్ధం చేసుకోవడం సామాన్యులకు కాస్త కష్టంగానే అనిపించవచ్చు.

అయితే సామాన్యులకు మందులపై అవగాహన పెంచేందుకై తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో రోగులకు సరఫరా చేసే వివిధ రకాల మందులపై ఆంగ్లంతో పాటు తెలుగులో కూడా పేర్లను ముద్రించి అందచేస్తున్నారు. సామాన్యులకు అర్ధమయ్యేలా ఉండడం, రోగులకు ఉచితంగా ఇస్తున్న ఈ మందులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే వీలులేకుండడంతో ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.