తెలంగాణ అప్పులపై విపక్షాలపై సెటైర్ వేసిన మంత్రి కేటీఆర్ – ఏమన్నారంటే…?

Tuesday, February 4th, 2020, 10:33:07 PM IST

ప్రస్తుతానికి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం కేసీఆర్ సర్కారుపై విపక్షాలన్నీ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. అనవసరమైన మాటలతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, నిప్పులు చెరుగుతున్నారు. అయితే పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించిన ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (FRBM) రివ్యూ కమిటీ నివేదికలో కొన్ని సంచలనమైన వాస్తవాలు బయటపెట్టారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు రాష్ట్ర జీడీపీలో 20 శాతం వరకు ఉండాల్సింది, కానీ 48 శాతానికి పైగా ఉన్నాయి… అంటే FRBM విధించిన సామాన్య పరిధి కంటే ఎక్కువ ఉంది.

ఇకపోతే మన రాష్ట్రంలో జీడీపీ ప్రకారం చూస్తే, ఆంధ్రప్రదేశ్ అప్పులు 31.6 శాతం ఉన్నాయి. అంటే సామాన్య పరిధి కంటే కూడా 11.6 శాతం ఎక్కువగా ఉందని అర్థమవుతుంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర జీడీపీ లో జీడీపీలో 17 శాతం ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంటే సామాన్య నిర్దేశిత పరిధిలోపే ఈ తెలంగాణ రాష్ట్ర అప్పులు ఉన్నాయని పక్కాగా అర్థమవుతుంది. ఈ మేరకు FRBM రివ్యూ కమిటీ నివేదికను తెలంగాణ మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేశారు మంత్రి కేటీఆర్. కాగా రాష్ట్ర అప్పులు కోసం ఎవరైనా తప్పుడు విమర్శలు చేస్తే సహించేది లేదని, ఈ నివేదికలు చూసైనా విపక్షాలు బుద్ది తెచ్చుకోవాలని మంత్రి కేటీఆర్ వాఖ్యానించారు.