బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా భారత్‌ల మధ్య జరుగుతున్న గబ్బా టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే ఈ హైదరబాద్ కుర్రాడు సాధించిన ఘనతకి నెటింట్ట ప్రసంశలు కురుస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా మహ్మద్ సిరాజ్‌పై ప్రసంశలు వర్షం కురిపించారు. తండ్రిని కోల్పోయిన విషాదకర పరిస్థితిలోనూ ఈ విధంగా రాణించడం మామూలు విషయం కాదని, నీ అద్భుత ప్రదర్శన భారత జట్టు ముందర సిరీస్ గెలిచే అవకాశాన్ని నిలిపిందని అన్నారు. అయితే నీ ఆటతీరు పట్ల మీ నాన్న ఖచ్చితంగా గర్విస్తాడని, పై నుంచే నీకు దీవెనలు అందిస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్సింగ్స్ ఇన్నింగ్స్ 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ 33 పరుగుల ఆధిక్యంతో కలిపి 328 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ముందు ఉంచింది. అయితే నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ 4 పరుగులు, గిల్ 0 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. అయితే ఆఖరి రోజు ఆటకు వరుణుడు అడ్డొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
What an amazing performance by our own lad from Hyderabad #SirajMohammed and that too after suffering such a tragic personal loss 👍
Your performance has given India the hope to go for a series win. I am sure your father must be a proud man blessing you from above pic.twitter.com/qHNqrDEG8p
— KTR (@KTRTRS) January 18, 2021