తెలంగాణ మంత్రి ఆకస్మిక తనిఖీ – ఎక్కడో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం…?

Sunday, February 9th, 2020, 06:56:25 PM IST

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నేడు రాష్ట్రంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఆకస్మిక తనికీలు చేపట్టారు. కాగా ఆదివారం నాడు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు సిద్దిపేటలోని శ్రీరామకుంట్ల శ్మశానవాటికను ఆకస్మికంగా పర్యటించారు. అంతేకాకుండా ఈ స్మశాన వాటికలో పలు అభివృద్ధి పనులు‌చేపట్టాలని సదరు అధికారులకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి హరీష్ రావు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే స్మశానవాటిక ప్రాంతంలో ఎక్కడ చుసిన కానీ ఎలాంటి చెత్త, పిచ్చి మొక్కలు, మరేవిధమైన ఇబ్బందికర చెత్త అసలే కనబడకూడదని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

ఈమేరకు మాట్లాడిన మంత్రి హరీష్ రావు స్మశానవాటికలో పిడకలు, కర్పూరం, నెయ్యి వంటి వాటితో అక్కడ అంత్యక్రియలు జరిపేలా స్థానిక ప్రజలందరినీ కూడా ప్రోత్సహించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రాజధాని హైదరాబాద్ ప్రాంతంలోని కొన్ని ప్రత్యేకమైన మహా ప్రస్థానం, ఇతర కొన్ని ప్రాంతాల్లోని స్మశాన వాటికలో విది విధానాలు, నిర్వహణలు ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటన్నింటి కంటే బాగా సిద్ధిపేట శ్రీరామ కుంట్ల స్మశాన వాటికను తీర్చిదిద్దేలా కృషి చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.