తెలంగాణలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల సమరం

Sunday, December 27th, 2015, 02:37:32 PM IST


తెలంగాణా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికాల్ సమరం ఈ రోజు ఉదయం 8గం. లకు ప్రారంభమైంది. హైదరాబాద్ మినహా మొత్తం 12 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 2న విడుదల చేయగా అందులో ఇప్పటికే 6 స్థానాలు టీఆర్ఎస్ కు ఏకగ్రీవమయ్యాయి. ఇక రంగా రెడ్డిలో రెండు, మహబూబ్ నగర్ లో రెండు, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొకటి చొప్పున 6 స్థానాలకు మొత్తం 19 మంది పోటీపడనున్నారు.

ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రాధాన్యతా ఓటింగ్ విధానాన్ని ఎన్నికల కమీషన్ అమలు చేయనుంది. ఒక్కో స్థానంలో నలుగు అభ్యర్థులు పోటీచేస్తే బ్యాలెట్ పై నాలుగు గుర్తులతో సహా నోటా అన్న మరో గుర్తు కూడా ఉంటుంది. ఓటర్లు అభ్యర్థులకు వారిచ్చే ప్రాధాన్యతను వరుసగా ఇవ్వవలసి ఉంటుంది. మొదట 1వ ప్రాధాన్యత ఇచ్చి తరువాత 2, 3 వరుసగా ఇవ్వవలసి ఉంటుంది. అలాకాకుండా మొదట నోటాకు ప్రాధాన్యత ఇస్తే మిగతా ప్రాధాన్యతలు లెక్కలోకి రావు. ఈ పోలింగ్ లో 3800మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 4గం.లకు ముగియనుంది.