కొత్త జిల్లాల‌కు ఏడాదిన్న‌ర అయినా..!?

Tuesday, May 1st, 2018, 01:50:57 AM IST

తెలంగాణ ఆవిర్భ‌వించ‌గానే కేసీఆర్ చేసిన మోస్ట్ ప్రామిస్సింగ్ న్యూ డెవ‌ల‌ప్‌మెంట్ జిల్లాల విభ‌జ‌న‌. ముక్కలుముక్క‌లుగా రాష్ట్రాన్ని విడ‌గొట్ట‌డంలో ఆయ‌న త‌ర‌వాతే అనిపించారు. టీస‌ర్కారు హ‌యాంలో కొత్త జిల్లాలు ఆవిర్భవించి ఏడాదిన్నర అవుతున్నది. 31 జిల్లాలతో కూడిన రాష్ట్ర మ్యాపు (చిత్రపటం), జిల్లాల మ్యాపులను ఇంత వరకు ఖరారు చేయలేదు. జిల్లాల విభజానంతరం భౌగోళికంగా ప్రతి జిల్లా సరిహద్దులు నిర్ణయించాలి. హద్దుల ప్రకారం జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలలో చిత్రపటాలను ప్రదర్శిస్తారు. జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (ట్రాక్) మ్యాపులను రూపొందించింది. కొన్ని జిల్లాల హద్దులలో స్పష్టత లేకపోవడం, మరికొన్ని గ్రామాలను జిల్లా పరిధిలో విలీనం చేయకపోవడం వంటి కారణాలతో నిలిపివేశారు.

జిల్లాలు ఏర్పాటు అయి ఏడాదిన్నర అవుతున్నా మ్యాపులను ఖరారు చేయడం లేదు. గతేడాది రెవెన్యూ, ప్రణాళిక శాఖ అధికారులు రంగురంగులతో మ్యాపులను రూపొందించి సీఎం కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లారు. ఆమోదం లభిస్తుందని వెళ్లిన అధికారులకు ఊహించని పరిణామం ఎదురైంది. జిల్లాల విభజన అధికారం రాష్ట్రాలకే ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంకా గుర్తించలేదంటూ ఆయన అధికారులను కసురుకున్నారు. కొన్ని జిల్లాల్లో గ్రామాలను చేర్చలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి, దీపం లేని గ్రామాల పరిస్థితి ఏంటనీ చెప్పి తిప్పి పంపారు. హఠాత్పరిణామంతో అధికారులు అవాక్కయ్యారు. వెంట తీసుకుని వెళ్లిన చిత్రపటాలను ఆవిష్కరించకుండానే తిరిగి తీసుకుని వచ్చారు. పాలనా సౌలభ్యం కోసం 2016 అక్టోబర్ నెలలో దీపావళి పండుగ రోజున కొత్త జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభించారు. పది జిల్లాల స్థానే 31 జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు రోజు జిల్లాల పేర్లు, మండలాలు, గ్రామాల పేర్లతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను పంపించారు. అయితే ఇంకా జిల్లాల లొల్లు పూర్తిగా స‌మ‌సిపోలేదు. విభ‌జ‌న‌లో అలాంటి వాటిని ప‌రిశీలించాలంటే ఇంకా చాంతాడంతో స్టోరీనే మిగిలి ఉంద‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌భుత్వంపై వెల్లువెత్తుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments