కోడెల ఆత్మహత్య కేసు.. కొడుకు, కూతురే కీలకం అంటున్న పోలీసులు..!

Wednesday, October 9th, 2019, 07:05:16 PM IST

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీ రాజకీయాలలో పెద్ద దుమారమే రేపింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కోడెలను చిత్ర హింస పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసారని టీడీపీ పెద్ద ఎత్తున వైసీపీపై ఆరోపణలు చేయగా, అయితే వైసీపీ టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు చంద్రబాబు పార్టీలో పట్టించుకోకపోవడం వలనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించింది.

అయితే కోడెల ఆత్మహత్య ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ కేసులో అసలు నిజాలు ఏమిటనేది ఇంకా భయటపడడంలేదు. అయితే ఆయన వాడిన సెల్‌ఫోన్ మాత్రం ఇంకా పోలీసులకు దొరకడం లేదు. అయితే కొద్ది రోజుల క్రితం కోడెల కుమారుడు, కూతురును తెలంగాణ పోలీసులు విచారణకు హాజర్ కావాలని కోరగా వారు కొద్ది రోజులు సమయం కావాలని అడిగారు. అయితే మరోవైపు అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు కేసులో మంగళగిరి కోర్టు కోడెల శివరాంకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే కోడెల కొడుకు, కూతురు ఇంకా విచారణకు హాజర్ కాకపోవడంతో కేసు మరింత ఆలస్యం అవుతుందని తెలంగాణ పోలీసులే గుంటూరు వెళ్లి వారి ఇద్దరి వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ కేసులో వారి ఇరువురిపై కూడా ఆరోపణలు ఉండడంతో వారి వాంగ్మూలం ఇప్పుడు పోలీసులకు కీలకంగా మారనుంది.