త్వరలో విదేశాలకు టిపోలీసులు!

Tuesday, October 14th, 2014, 10:03:49 AM IST

nayani
తెలంగాణ హోంమంత్రి నాయని నర్సింహా రెడ్డి హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో సీనియర్ అధికారులతో కలిసి లండన్, న్యూయార్క్ నగరాలను పర్యటించి అక్కడ పోలీస్ వ్యవస్థను పరిశీలించనున్నట్లుగా తెలిపారు. అలాగే పోలీస్ శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్లు నాయిని పేర్కొన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ మహిళలపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ ను సేఫ్ మరియు స్మార్ట్ సిటీగా మార్చదలచుకున్నట్లు నాయిని తెలిపారు. ఇక నగరంలో మరింత భద్రతను పెంపొందించేందుకు గతంలో ముంబై పోలీసు వ్యవస్థను పరిశీలించామని ఇప్పుడు త్వరలో లండన్, న్యూయార్క్ నగరాలను పరిశీలించబోతున్నామని నాయిని నర్సింహా రెడ్డి వివరించారు.