పదో తరగతి ఫలితాలపై తెలంగాణ సర్కార్ కసరత్తు.. గ్రేడ్లు ఎలా ఇస్తున్నారంటే?

Tuesday, May 11th, 2021, 12:42:25 AM IST

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలొ ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల కోసం ఫీజులు చెల్లించిన విద్యార్థులందరిని పాస్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం త్వరలోనే ఫలితాలను వెల్లడించేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే గతేడాది ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా ప్రభుత్వం ఫలితాలు వెల్లడించింది.

అయితే గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాలని నిర్ణయించింది. కాగా ప్రస్తుతం మార్కుల అప్ లోడింగ్, గ్రేడింగ్ ప్రక్రియ జరుగుతోంది. మార్కుల అప్‌లోడ్ పూర్తికాగానే ఫలితాలు ప్రటించాలని విద్యాశాఖ యోచిస్తోంది. అయితే బోర్డు వెల్లడించిన ఫలితాలతో సంతృప్తి చెంద‌ని విద్యార్థులు ఎవరైనా పరిస్థితులు చక్కబడ్డాకా వ్యక్తిగతంగా పరీక్షలు రాయొచ్చని గతంలోనే విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.