8 వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ

Sunday, June 6th, 2021, 05:31:46 PM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మే 12 వ తేదీ నుండి లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ ను ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎత్తివేయాలా లేక పొడిగించాలా అనే విషయం పై ఈ నెల 8 వ తేదీన కేబినెట్ భేటీ జరగనుంది. అయితే ఇందుకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. 8 వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కరోనా లాక్ డౌన్ కొనసాగింపు తో పాటుగా, కరోనా పరిస్థితులు, కరోనా వైరస్ ను అరికట్టడానికి శాఖ ల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, కరోనా వైరస్ మూడవ దశ సన్నద్ధత తో పాటుగా, వైద్యం మరియు నీటి పారుదల ప్రాజెక్టుల పనుల పురోగతి మరియు చేపట్టాల్సిన చర్యల పై కీలక చర్చ జరగనుంది.

అయితే ప్రస్తుతం రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో అన్ లాక్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతేకాక రైతు బంధు, వ్యవసాయ పనులు, రాష్ట్ర ఆర్థిక శాఖ కి సంబందించి పలు అంశాల పై కీలక చర్చ జరగనుంది.