ప్రైవేట్ ఆసుపత్రులకి టీకా పంపిణీ నిలిపివేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం!

Friday, April 30th, 2021, 04:00:22 PM IST

ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా వైరస్ వాక్సిన్ పంపిణీ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం లోని ప్రైవేట్ ఆసుపత్రులకి వాక్సిన్ డోస్ లను నిలిపి వేయాలని డీఎంహెచ్ఓ లకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు అయిన డాక్టర్ శ్రీనివాస్ ఆదేశాలను జారీ చేశారు. అయితే ఇప్పటి వరకూ కూడా ఉన్నటువంటి డోసులను వినియోగించుకోవచ్చు అని డీ హెచ్ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అయితే వినియోగించగా మిగిలిన టీకాలను సేకరించాలి అని సిసిపి వైద్యాధికారులు, ఫార్మసిస్ట్ లకు డీ హెచ్ ఆదేశాలను జారీ చేశారు. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లో వాక్సిన్ కొరత ఉండగా, ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం తో ప్రజలు కొంత ఆందోళన చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.