నైట్ కర్ఫ్యూ ను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Friday, April 30th, 2021, 03:18:14 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా చెందడం తో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నేటితో ముగియాల్సిన ఈ కర్ఫ్యూ ను పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 8 ఉదయం అయిదు గంటల వరకు ఈ కర్ఫ్యూ ను పొడిగిస్తూ కీలక ప్రకటన చేయడం జరిగింది. శనివారం ఉదయం 5 గంటలకు ఈ కర్ఫ్యూ ముగిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం కర్ఫ్యూ విధించినప్పటికీ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుచేత మరి కొద్ది రోజుల పాటు ఈ రాత్రి కర్ఫ్యూ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన సోమేశ్ కుమార్ కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వులను జారీ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్ట్ సీరియస్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కట్టడి చర్యల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల హైకోర్ట్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల నిర్వహణ పై సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే తాజాగా రాత్రి కర్ఫ్యూ నిర్ణయం తో తదుపరి విచారణ ను మే 5 వ తేదీ కి హైకోర్ట్ వాయిదా వేయడం జరిగింది.