హైదరాబాద్ లో కరోనా టెస్టులకు బ్రేక్…అసలు కారణం ఇదే!

Thursday, June 25th, 2020, 04:42:21 PM IST

తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయం, 50 వేల కరోనా టెస్టుల నిర్వహించడం. రెడ్ జోన్, కంటైనేమెంట్, హాట్ స్పాట్ ప్రాంతాలలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతాలకు వంద మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్ళ లోని వారికి కూడా కరోనా టెస్టుల ను నిర్వహించాలని భావించింది. అయితే అకస్మాత్తుగా ఈ నిర్ణయానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సేకరించిన శాంపిల్స్ ను పరీక్షించక పోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పడి రోజుల్లోనే 50 వేల టెస్టుల చేస్తామని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం, ఆశించిన స్థాయిలో పని చేస్తున్నట్లు గా పని చేయడం లేదు. ఇప్పటికే సేకరించిన వాటికి పరీక్షలు నిర్వహించక పోవడం, ఇందుకు ఎక్కువగా సమయం పట్టడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేడు, రేపు అనగా గురువారం, శుక్రవారం శాంపిల్స్ ను సేకరించ వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది.

తెలంగాణ రాష్ట్రం లో ఊహించని రీతిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రం లో 10 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు కావడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రం లో అయిదు వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా వైరస్ కి సంబంధించిన వాక్సిన్ ఇంకా ప్రజలకు అందుబాటులోకి లేకపోవడం కారణం గా ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.