తెలంగాణ జెడ్పీ ఛైర్మ‌న్లు 20 మ‌హిళ‌ల‌కే!

Saturday, June 8th, 2019, 06:21:49 PM IST

తెలంగాణలో జడ్పీ ఛైర్మన్ల ఎంపికలోనూ తెరాస హవా కొనసాగింది. 32 జిల్లాల్లోనూ తెరాస విజయ ఢంకా మోగించింది. నిన్న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసిన అధికార పార్టీ అభ్యర్థులు జడ్పీ ఛైర్మన్ల ఎన్నికల్లోనూ సత్తా చాటారు. రాష్ట్రంలోని అన్ని జడ్పీలనూ తెరాస కైవసం చేసుకుంది. 20 జడ్పీ పీఠాల్లో మహిళలే చోటు దక్కించుకోవ‌డం ఆస‌క్తిక‌రం. అన్ని జిల్లాల్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవుల్ని తెరాస క్లీన్ స్వీప్ చేయ‌డం ఓ సంచ‌ల‌నం అనే చెప్పాలి. తాజా విజ‌యానికి స్పందించిన సీఎం కేసీఆర్.. ప్రజలకు, ఓటర్లకు ధన్యవాదాలు చెప్పారు. స్థానిక సంస్థల్లో దక్కిన గెలుపు ప్రజా విజయంగా కేసీఆర్‌ అభివర్ణించారు. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌/ ఛైర్మన్లుగా ఎన్నిక వివ‌రాలివీ..

ఆదిలాబాద్‌ – రాథోడ్‌ జనార్దన్‌, నారాయణపేట – వనజమ్మ, కరీంనగర్‌ – కనుమల్ల విజయ, కామారెడ్డి – దఫేదార్‌ శోభ, నిజామాబాద్‌ – విఠల్‌ రావు, జయశంకర్‌ భూపాలపల్లి – జక్కు శ్రీహర్షిణి, మహబూబాబాద్‌ – ఆంగోతు బిందు, ములుగు – కుసుమ జగదీశ్‌, నిర్మల్‌ – విజయలక్ష్మీ, కుమ్రంభీం -ఆసీఫాబాద్‌ – కోవ లక్ష్మీ, మంచిర్యాల – నల్లాల భాగ్యలక్ష్మీ, వనపర్తి – లోక్‌నాథ్‌ రెడ్డి, నాగర్‌కర్నూలు – పద్మావతి, జోగులాంబ గద్వాల – సరిత, భద్రాద్రి కొత్తగూడెం – కోరం కనకయ్య, మేడ్చల్‌ -మల్కాజ్‌గిరి – శరత్‌ చంద్రారెడ్డి, మహబూబ్‌నగర్‌ – స్వర్ణ సుధాకర్‌, యాదాద్రి భువనగిరి – సందీప్‌ రెడ్డి, సూర్యాపేట – గుజ్జ దీపిక, ఖమ్మం- లింగాల కమల్‌రాజ్‌, వికారాబాద్‌ – సునీతా మహేందర్‌ రెడ్డి, రంగారెడ్డి – తీగల అనితారెడ్డి, నల్గొండ – బండా నరేందర్‌రెడ్డి, సిద్దిపేట – రోజా శర్మ, సంగారెడ్డి – మంజుశ్రీ, మెదక్‌ – హేమలత, వరంగల్‌ అర్బన్‌ – మారేపల్లి సుధీర్‌, వరంగల్‌ రూరల్‌ – గండ్ర జ్యోతి, జనగామ – సంపత్‌ రెడ్డి, జగిత్యాల – దావ వసంత, పెద్దపల్లి – పుట్ట మధు, రాజన్న సిరిసిల్ల – అరుణ.