బిగ్ బాస్ కోసం ఎన్టీఆర్ చాలా చేసాడు! నెక్స్ట్ ఎం చేస్తాడు?

Tuesday, September 26th, 2017, 12:10:11 PM IST


బిగ్ బాస్ సీజన్ వన్ కంప్లీట్ అయిపోయింది. తెలుగులో కూడా బిగ్ బాస్ స్టార్ మాకి మంచి రేటింగ్ తో పాటు రెవెన్యూ తీసుకొచ్చింది. ఇకపై నెక్స్ట్ సీజన్ ఎలా చేయాలి అనే ఆలోచనతో బిగ్ బాస్ టీం ప్లాన్ చేసుకుంటుంది. అయితే బిగ్ బాస్ ఇంత పెద్ద హిట్ అవడానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలియడానికి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ అతని యాంకరింగ్ టాలెంట్ తో బిగ్ బాస్ షోకి అదిరిపోయే రెస్పాన్స్ రావడంలో చాలా కీలకంగా మారాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ లో యాక్టింగ్ టాలెంట్ మాత్రమె చూసిన తెలుగు ఆడియన్స్ అతనిలో మరో అదిరిపోయే కళ కూడా ఉందని బిగ్ బాస్ షోతో తెలిసిపోయింది. బిగ్ బాస్ షోని నిలబెట్టడంలో ఎన్టీఆర్ వాక్చాతుర్యం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. శని, ఆదివారాల్లో అతను వస్తూ చేసే సందడి, అప్పటికప్పుడు అతను మాట్లాడే విధానం అందరికి భాగా కనెక్ట్ అయ్యింది. దీంతో బిగ్ బాస్ సీజన్ వన్ హిట్ అయ్యింది. అయితే హిందీ షోకి ఉన్నంత పాపులారిటీ లేకపోయినా, హైప్ లేకపోయినా ఉన్నంతలో స్టార్ మాలో అన్నిటికంటే బెటర్ గా నడించింది.

అయితే ఇప్పుడు బిగ్ బాస్ తో ఎన్టీఆర్ కి హీరోగా ఓ రకమైన క్రేజ్ క్రియేట్ చేసుకుంటే. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకి చాలా దగ్గర కావడం ద్వారా ఎన్టీఆర్ తమ ఇంట్లో ఒకడిగా భావించే స్థాయికి వచ్చాడు. అతని సినిమాని ఇది వరకు అభిమానులు మాత్రమె ముందుగా థియేటర్స్ కి వెళ్లి షోలు చూసేవారు. ఇప్పుడు టెలివిజన్ ప్రేక్షకులు అందరు, అందరికంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ గా మారిపోయారు. ఈ షో తర్వాత మరల ఎన్టీఆర్ యాంకర్ గా కనిపిస్తే చూడాలని చాలా మంది ఆశిస్తున్నారు. అయితే స్టార్ హీరోలు ఇప్పుడు ఏదో ఒక్క షోతో ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది. కాబట్టి మరల బుల్లితెర మీద ఎన్టీఆర్ ని చూడాలంటే సీజన్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments