స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోవ‌డ‌మెలా?

Saturday, June 2nd, 2018, 12:42:19 PM IST

గ్లామ‌ర్ ప్ర‌పంచంలో మ‌డి క‌ట్టుకుని కూచుంటే ప‌న‌వ్వ‌దు. ఈ విష‌యాన్ని వేగంగా గ‌మనించే తెలుగమ్మాయిలు ఉన్నారు. ఎక్స్‌పోజింగ్‌లో ఏమాత్రం అడ్డు -ఆపూ లేకుండా చెల‌రేగిపోయి, వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేసిన నాయిక‌లు ఉన్నారు. అయితే అలాంటి వాళ్ల‌కు పూర్తి విభిన్నంగా కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటోంది ఓ తెలుగ‌మ్మాయ్‌. అంత‌కుముందు- ఆ త‌ర‌వాత చిత్రంతో అనూహ్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఇషా రెబ్బా ..ప్ర‌స్తుతం ఒక్కో క్రేజీ ప్రాజెక్టుకు సంత‌కం చేస్తూ వేడి పెంచుతోంది.

తాజాగా ఎన్టీఆర్‌- త్రివిక్ర‌మ్ సినిమాలో ఒకానొక లీడ్ పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని వార్త‌లొచ్చాయి. ఇంత‌కుముందు అ! సినిమాలో అద్భుత‌మైన న‌ట‌న‌, అంద‌చందంతో ఆక‌ట్టుకున్న ఈ అమ్మ‌డు దుర‌దృష్ట వ‌శాత్తూ కొన్ని ఫ్లాపుల్లో న‌టించిందే కానీ, త‌న అందానికి హై లెవల్లోనే ఛాన్సులొస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక గ్లామ‌ర్‌, ఎక్స్‌పోజింగ్ విష‌యంలో మ‌డిక‌ట్టుకుని కూచోక‌పోతే త‌న‌కు అంద‌నిదే ఉండ‌దు. అంద‌చందాల్లో, ప్ర‌తిభ‌లో తెలుగ‌మ్మాయిలు ఆకాశం ఎత్తు! ఆ ఒక్క నియ‌మం పెట్టుకోక‌పోతే స్టారాధి స్టార్ల‌తో చాన్సులుంటాయ్‌. ఇటీవ‌లే ఇషా రెబ్బా స్విమ్మింగ్ పూల్ యాక్ట్ ఒక‌టి ఫోటో రూపంలో బ‌య‌టికి వ‌చ్చింది. అయితే ఇందులో ఎక్క‌డా అస‌భ్య‌త అన్న‌దే చూప‌లేదు ఈ తెలుగ‌మ్మాయ్‌. అయితే ఎక్స్‌పోజింగుకి, అందాల ఎలివేష‌న్‌కి ఉన్న స‌న్న‌ని లైన్‌ని ఈష మెయింటెయిన్ చేయ‌డం చూస్తుంటే.. అవ‌కాశాల కోసం దిగ‌జార‌ని ఆ క‌మిట్‌మెంట్‌ని ఓ ర‌కంగా ప్ర‌శంసించాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments