మరో కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టిన శర్వా…

Thursday, April 5th, 2018, 12:47:26 PM IST

చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి దగ్గరై తనకంటూ ఒక మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకొని, విభిన్న క‌థ‌ల‌ని ఎంచుకుంటూ కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్న హీరో శ‌ర్వానంద్‌. ప్ర‌స్తుతం రొమాంటిక్ చిత్రాల స్పెషలిస్ట్ హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వంలో ప‌డి ప‌డి లేచే మ‌న‌సు అనే సినిమా చేస్తున్నాడు. శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బేన‌ర్‌పై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి సంయుక్తంగా ఈ చిత్రానికి నిర్మాతలుగా వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించగా, ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాలు కొల్ల‌గొట్టిన సాయి ప‌ల్ల‌వి ఈ మూవీలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్రేమ క‌థా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. ఇక త‌న 28వ సినిమాగా సుధీర్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లోను ఓ సినిమా చేస్తున్నాడు శ‌ర్వానంద్‌. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు వైజాగ్‌లో మొద‌లైంది. హ‌లో ఫేం క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌ను క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తొలి షెడ్యూల్‌లో హీరో హీరోయిన్స్ మ‌ధ్య కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా శర్వానంద్ కెరియర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుంద‌ని టీం భావిస్తుంది. ఈ ఏడాది చివ‌రిలో మూవీ రిలీజ్ చేసేలా టీం అన్ని విధాలా ప్లాన్ సిద్దం చేసుకుంది.