సినీ పరిశ్ర‌మ నిన్ను శిక్షించ‌డం ఖాయం: శ్రీ రెడ్డి

Thursday, April 5th, 2018, 12:38:46 PM IST

కాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన కొంద‌రు సినీ ప్ర‌ముఖులు త‌న‌ని మాన‌సికంగా, శారీర‌కంగా వేధించార‌ని కొద్ది రోజులుగా శ్రీ రెడ్డి ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత ర‌మేష్ పుష్పాల‌, ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ములపై ఇటీవ‌ల ప‌లు ఆరోప‌ణ‌లు చేసిన శ్రీ రెడ్డి రీసెంట్‌గా సింగ‌ర్ శ్రీరామ్ చాటింగ్‌ని బ‌య‌ట‌పెట్టి రచ్చ చేసింది. ఇక అక్క‌డితో ఆగ‌కుండా ఆన్‌స్క్రీన్ పై నేచుర‌ల్ స్టార్‌గా ఉన్న నువ్వు.. రియ‌ల్ లైఫ్‌లోను బాగా న‌టిస్తావు అంటూ సోష‌ల్ మీడియాలో మ‌రో లీక్ చేసి క‌ల‌క‌లం సృష్టిస్తుంది.

నువ్వు వెండితెర‌పైనే కాదు , రియ‌ల్ లైఫ్‌లోను బాగా న‌టిస్తావు. నువ్వు నేచుర‌ల్‌గా క‌నిపిస్తావు . కాని అది ముసుగు మాత్ర‌మే. జీవితంలో చాలా స్ట్ర‌గుల్స్ చేశాన‌ని ఎప్పుడు చెప్పుకుంటావు, కానీ అదంతా జ‌నాల సానుభూతి కోస‌మే. నువ్వు ఎప్పుడు జ‌నాల ముందు డ్రామా చాలా బాగా ప్లే చేస్తావు. పెద్ద హీరోలు రామ్ చ‌ర‌ణ్, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్ వంటి వారికి తండ్రి, తాతల స‌పోర్ట్ ఉన్నా వారు నిజాయితీగా ప‌ద్ద‌తిగా ఉంటారు. వారికి ఇగో ఏ మాత్రం ఉండ‌దు. వారి నుండి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చిన్న డైరెక్ట‌ర్స్‌, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ద‌ర్శ‌కుల‌ని నువ్వు ఏ మాత్రం గౌర‌వించ‌వు. ఇటీవ‌లే నీకు కొడుకు పుట్టాడు. కంగ్రాచ్యులేష‌న్స్. నువ్వు నీ జీవితంలో జాగ్ర‌త్త‌గా ఉండు. నువ్వు వాడుకున్న అమ్మాయిలంద‌రు ఇప్ప‌టికీ ఏడుస్తూనే ఉన్నారు. ఒక్క‌టి గుర్తు పెట్టుకో, దేవుడు ఎప్పుడు న్యాయం వైపే ఉంటాడు. కాక‌పోతే శిక్ష ప‌డ‌డానికి కొంచెం టైం ప‌ట్టొచ్చు. నువ్వు త‌ప్ప‌క ఇబ్బందిపడ‌తావు. సినీ పరిశ్ర‌మ నిన్ను శిక్షించ‌డం ఖాయం. ఇండ‌స్ట్రీ నుండి ఇలాంటివ‌న్నీ ఈక‌లా రాలిపోవాలి అంటూ శ్రీరెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. శ్రీ రెడ్డి పోస్ట్‌పై ప‌లువురు ప‌లు రకాలుగా త‌మ‌ అభిప్రాయాలు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. శ్రీ రెడ్డి ఎప్పడు ఎలాంటి ఆరోపణలు చేస్తుందా ఎవరిపై చేస్తుందా అంటూ కొందరు సినీ ప్రముఖులు భయాందోళనలో ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments