తెలుగు యువకుడి ప్రాణం తీసిన అమెరికా జాతి వివక్షలు !

Sunday, February 12th, 2017, 03:40:17 PM IST


అందమైన భవిష్యత్తు కోసం కలలు కని అమెరికాలో విద్యనభ్యసించడానికి వెళ్లిన ఓ తెలుగు యువకుడు జాతి వివక్షకు బలైనాడు. వరంగల్ జిల్లాకు చెందిన వంశి మామిడాల అనే యువకుడు సిలికాన్ వ్యాలీలో ఎమ్ ఎస్ పూర్తి చేసాడు. శాన్ఫ్రాన్సిస్కో లోని ఓ స్టోర్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న వంశి పై ఓ వ్యక్తి కాల్పులు జరిపి హత్య చేసాడు. గత రాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తున్న వంశీపై గుర్తు తెలియని తెల్ల వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

వంశి హత్యకు జాతి వివక్షే కారణం అని తెలుస్తోంది. కాల్పులు జరిపే సమయంలో అతడు డ్రగ్స్ తీసుకుని ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో జాతి వివక్షలకు తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.