కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్న తెలుగు ప్రజలు.. కారణం అదే..!

Wednesday, February 19th, 2020, 12:45:53 AM IST

కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డిపై తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పర్యటన సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తెలుగు ప్రజలకు రైళ్ళు అంటే ఏంటో తెలియవని, ఎర్రబస్సులు తప్ప రైల్వే ప్రయాణం గురుంచి ఎరుగరని కిషన్ రెడ్డి అన్నారు.

అయితే తెలుగు ప్రజలకు రైళ్ళను పరిచయం చేసింది ప్రధాని మోదీనే అని, మోదీ వచ్చాకే రైల్వే వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. అయితే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలతో పాటు, తెలుగు ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ప్రజలను కించపరిచే విధంగా కిషన్ రెడ్డి మాట్లాడడం తప్పని అభిప్రాయపడుతున్నారు.