బన్నీ ఆడియో ఫంక్షన్ కు సినీ అభిమానుల్ని రానివ్వరట..!

Wednesday, April 18th, 2018, 04:51:35 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య వ‌క్కంతం వంశీ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. మే 4న విడుద‌ల కానున్న ఈ మూవీ ఆర్మీ నేపథ్యంలో రూపొందింది. చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఈ నెల 22న చిత్ర ఆడియో వేడుకని పశ్చిమ గోదావరి జిల్లా .. తాడేపల్లి గూడెం సమీపంలోని ‘మిలటరీ మాధవరం’ లో జరగనుందని మాజీ సైనికోద్యోగుల సంఘం తెలిపింది. సినిమా మిలటరీ నేపథ్యంలో తెరకెక్కడం, బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా నటించిన కారణంగానే ఇక్కడ ఆడియో వేడుక ప్లాన్ చేశారట.

‘మిలటరీ మాధవరం’ అనే ఊళ్ళో ప్రతి కుటుంబం నుండి ఒక్కో ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు. ఆడియో వేడుక స‌మ‌యంకి ముందు రోజే బ‌న్నీ ఆ ఊరికి వెళ్ళి అక్కడ మిలిట‌రీ కుటుంబాల‌ని కూడా క‌లుస్తార‌ట‌. అయితే వేడుకకి వచ్చే మాజీ సైనికోద్యోగులు, సైనికులు తెల్ల షర్ట్‌, నల్లఫ్యాంట్‌ ధరించి ఈనెల 22 సాయంత్రం 4.30 గంటలకు హాజరు కావాలని మాజీ సైనికోద్యోగుల సంఘం తెలిపింది. అయితే ఈ ఆడియో ఫంక్షన్ వేడుకకు సైనికులను తప్ప మిగిలిన సాధారణ జనాలకు రావడానికి పర్మీషన్ ఇవ్వడం కష్టమని వార్తలు వేల్లువడ్డాయి, అందుకనే అభిమానుల కోసం ఆడియో వేడుక త‌ర్వాత ఏప్రిల్ 29న ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహిస్తార‌ని తెలుస్తుంది. ఈ వేడుక గచ్చిబౌలి, యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ ,ఎల్బీ స్టేడియం .. ఈ మూడింటిలోని ఒక ప్రదేశంలో జ‌రగనుంది.

నా పేరు సూర్య చిత్రం తెలుగులోనే కాక ప‌లు భాష‌ల‌లోను విడుద‌ల కానుంది. కే.నాగబాబు, పి.వాసు సహ నిర్మాతలుగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శ్రీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. విశాల్‌–శేఖర్‌ ద్వయం సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఎన్‌ పేరు సూర్య ఎన్‌ వీడు ఇండియా అనే పేరుతో కోలీవుడ్‌లో విడుద‌ల కానుంది. అను ఎమ్మాన్యుయేల్ చిత్రంలో కథానాయికగా నటించిన విషయం విదితమే.

  •  
  •  
  •  
  •  

Comments