వివాదంలో రీమిక్స్ సాంగ్‌.. సెక్స్ యాక్ట్ అంటూ చీవాట్లు!

Wednesday, March 21st, 2018, 09:05:59 PM IST

గ‌త వారం రోజులుగా వెబ్‌లో శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్విలిన్ గురించిన వార్త‌లే. ఈ అమ్మ‌డు న‌ర్తించిన `ఏక్ దో తీన్‌…` సాంగ్ గురించే స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బాలీవుడ్ క్లాసిక్ మూవీ `తేజాబ్‌`లో మాధురి ధీక్షిత్ పెర్ఫామ్ చేసిన ప్ర‌త్యేక గీతం `ఏక్ దో తీన్‌..` రీమిక్స్‌లో జాక్విలిన్ డ్యాన్సులు చేసింది. అది కూడా టైగ‌ర్ ష్రాఫ్ – దిశాప‌టానీ న‌టించిన `భాఘి 2` కోసం ఈ ఫీట్ వేసింది. ఈ రీమిక్స్ సాంగ్‌కు సంబంధించిన టీజ‌ర్‌, ఫుల్ వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో రిలీజై సెన్సేష‌న‌ల్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఏక్ దో తీన్ .. సాంగ్‌కి జాక్విలిన్ ఓ రేంజులో అభిన‌యించిందంటూ మాధురి అభిమానులే హ‌ర్షం వ్య‌క్తం చేశారు. జాక్విలిన్‌కి అభిమానులు అయిపోయారు. అయితే ఏమైందో ఈలోగానే ఈ ప్ర‌త్యేక రీమిక్స్‌ గీతం వివాదంలోకి వ‌చ్చింది.

మాతృక `తేజాబ్‌` సృష్టిక‌ర్త‌లు, ఆ పాట‌కు కొరియోగ్రాఫ్ చేసిన నాటి మేటి కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ .. తాజా రీమిక్స్‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. జాక్విలిన్ ఓ వేశ్య‌లా `సెక్స్ యాక్ట్‌` చేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. నాటి మేటి క్లాసిక్‌ని ఇలా తెర‌కెక్క‌స్తారా? అంటూ విరుచుకుప‌డ్డారు. త్వ‌ర‌లోనే లీగ‌ల్‌గా యాక్ష‌న్ తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. తేజాబ్ ద‌ర్శ‌క‌నిర్మాత ఎన్‌.చంద్ర‌- స‌రోజ్ ఖాన్.. భాఘి 2లో ఈ పాట‌ను తెర‌కెక్కించిన విధానంపై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం .. వివాదం అవ్వ‌డం బాలీవుడ్‌లో చ‌ర్చ‌కొచ్చింది. తాజాగా జాక్విలిన్‌తో తెర‌కెక్కించిన గీతానికి గ‌ణేష్ ఆచార్య కొరియోగ్ర‌ఫీ అందించ‌డం కూడా ఈ వివాదానికి కార‌ణ‌మైంద‌ని చెబుతున్నారు.