మనువడి బర్త్ డే సంబరాల్లో తలైవా!

Monday, May 7th, 2018, 03:41:21 PM IST


తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొద్దిరోజుల క్రితం పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను చుట్టి వచ్చిన విషయం తెలిసిందే. కాగా అనంతరం ఆయన అమెరికా వెళ్లారు. అయితే ఆయన అమెరికా చిన్న శస్త్ర చికిత్ర నిమిత్తం వెళ్లారని మీడియాలో విరివిగా కథనాలు వెలువడినప్పటికీ ఆయన అక్కడికి దేనికి వెళ్లారనేది స్పష్టం కాలేదు. అయితే వున్నట్లుండి అమెరికా నుండి చెన్నై చేరుకున్న రజిని తన ముద్దుల మనువడు వేద్ కృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజిని ఆ పుట్టినరోజు వేడుకల ఫోటోలను ట్విట్టర్ లో ‘మూడేళ్ళ క్రితం ఈ ఏంజెల్ నా జీవితంలోకి వచ్చాడు, మై మిరాకిల్, మై బేబీ, తనతో జరుపుకుంటున్న వేడుకలు’ అంటూ ఫోటోలు పెట్టి ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. రజిని చిన్న కుమార్తె సౌందర్య కుమారుడే వేద్. ఆమెకు 2010 లో చెన్నై కు చెందిన వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్ తో ప్రేమ వివాహం జరిగింది. అయితే కొన్నాళ్ళు సజావుగానే సాగిన వీరికాపురం, తరువాత సమస్యల మాయం కావడంతో, ఇద్దరు కలిసి 2015లో విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. కాగా వీరికి 2017లో విడాకులు మంజూరు అయ్యాయి, కుమారుడు వేద్ తల్లితోనే ఉంటున్నాడు. రజిని నివాసంలో నిర్వహించిన వేద్ పుట్టినరోజు వేడుకలకు పెద్ద కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్, సంగీత దర్శకుడు అనిరుద్ హాజరయినట్లు తెలుస్తోంది…….

Comments