మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన.. మిల్కి బ్యూటీ?

Saturday, September 8th, 2018, 06:22:51 PM IST

మిల్కి భామ తమన్నా .. మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభినేత్రి ప్లాప్ అవ్వడంతో కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు అటు తమిళంలో, ఇటు తెలుగులో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం వెంకటేష్ సరసన ఎఫ్ 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటిస్తున్న మల్టీ స్టారర్ ఎఫ్ 2లో నటిస్తున్న ఈమెకు తాజాగా మరో క్రేజీ అవకాశం దక్కింది. తాజాగా మాస్ హీరో విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కే ద్విభాషా చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాలో తమన్నా ఛాన్స్ కొట్టేయడం పై మిగతా హీరోయిన్స్ షాక్ అయ్యారట. దాంతో పాటు తమన్నా మెగాస్టార్ సైరా లో కూడా కీ రోల్ పోషిస్తుంది. మొత్తానికి మళ్ళీ ఫామ్ లోకి రావడానికి తమన్నా బాగానే కష్టపడుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments