బురదజల్లినంత మాత్రాన కాసులురాలవ్ బాబు

Friday, September 12th, 2014, 06:00:24 PM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ధిక సంఘం ముందు పెట్టిన ప్రాతిపాదిక ఏమాత్రం ఉపయోగకరంగా లేవని..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు వైఎస్ జగన్ ను విమర్శించడమే పనిగా మారిందని.. ఆయన అన్నారు. బహుశా బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆనందంలో మతిభ్రమించి ఉంటుందని.. అందుకే ఏం మాట్లాడుతున్నారో.. ఎలా మాట్లాడుతున్నారో.. ఆయనకే అర్ధం కావడం లేదని తమ్మినేని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఒకసారి సింగపూర్ లా చేస్తామని.. మరోసారి ముంబైలా తీర్చి దిద్దుతామని అంటున్నారని..ఆయన అన్నారు. ముంబై.. సింగపూర్ నగరాలు ఇప్పటికే ఉన్నాయని.. కొత్తగా ఆలోచించాలని తమ్మినేని హితవుపలికారు. గత ప్రభుత్వాలపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని.. ఆయన అన్నారు. రాజ్యంగ బద్దంగా ఏర్పడిన ఆర్ధిక సంఘం ముందు తన ప్రతిపాదనలను నిర్మాణాత్మకంగా వివరించి నిధులు రాబట్టుకోవాలని తమ్మినేని చంద్రబాబుకు సూచించారు.