సామాన్య జనం గమనిస్తున్నారా..వైసీపీ,టీడీపీ దొందు దొందే..!

Wednesday, September 11th, 2019, 01:06:06 PM IST

రాజకీయాలు అంటే ఇష్టమున్న వారు ఉంటారు అదే అసహ్యించుకునే వారు ఉంటారు.తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఎంత నీచానికి అయినా సరే దిగజారిపోయినా సరే తాము అభిమానించే నాయకులను బానిసల్లా మోసే అభిమానులు ఇంకా చాలా మందే మన సమాజంలో ఉన్నారు.తనకు అభిమానించే నేత కానీ రాజకీయ నాయకుడు కానీ తప్పుడు వ్యక్తే అని తెలిసినా కూడా వారికే మద్దతు అంటూ ఏదో వికార ప్రేమను ప్రదర్శిస్తారు.

అందువల్ల వ్యక్తిగతంగా వారు మాత్రమే లాభ పడతారు తప్ప సామాన్య ప్రజానీకం మాత్రం ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే బాగుపడలేకపోతున్నారు.ఎప్పుడు వీళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళని వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళని ఒకరి మీద ఒకరు ప్రతీకార చర్యలు తీసుకోవడం తప్ప మన ఏపీ రాజకీయాల్లో కొత్తగా ఏమి జరగడం లేదని సామాన్య ప్రజలు ఈ చోద్యాన్ని అంతా చూసి విసుగెత్తిపోతున్నారు.

తాజాగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు,ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీకు పెద్ద తేడా ఏముందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీను ఎలా అయితే పోలీసు వ్యవస్థతో తమ అధికార బలంతో తెలుగుదేశం అధిష్టానం ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తుందని ఇలా ఒకరి మీద ఒకరు ప్రతీకార రాజకీయాలు చేసుకుంటున్నారు తప్ప మరోటి లేదని అంటున్నారు.

తమని ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ వారు ఇప్పుడు అంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉందని వారు అధికారంలో ఉన్నపుడు వైసీపీను ఇలాగే ఇబ్బందులకు గురి చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయని,ఈ విషయంలో రెండు పార్టీలు దొందు దొందే అని చీదరించుకుంటున్నారు.